సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత సీజన్అట్టర్ ఫెయిల్ అయినప్పటికీ ఇటీవల మంచి పేక్షక ఆదరణతో దూసుకొని పోతున్న బిగ్ బాస్ షో తెలుగు సీజన్ 9 కు బిగ్ షాక్ లు తగులుతున్నాయి. షోలో పాల్గొంటున్న హోస్ మేట్స్ అశ్లిలత తో ఆడామగా తేడాలేకుండా తరుచు కౌగిలింతలతో, శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారని షో ఫై చర్యలు తీసుకోవాలని. షో నిర్వాహకులు కూడా విచిత్ర ఆటలతో షో రేటింగ్ కోసం అశ్లీలాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఈ షో వల్ల యువత పెడదారి పట్టే అవకాశం ఉందని ఆరోపణ చూస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పలువురు ఫిర్యాదు చేశారు. కాగా, తెలుగు బిగ్ బాస్ తరచూ వివాదంలో నిలుస్తోంది. ప్రస్తుతము ప్రతి రోజు ఆడవాళ్లు చేస్తున్న రచ్చ గొడవలు,దొంగతనాలు వారి వ్యవహారశైలి షో చూసేవారికి ఆడవారంటే గౌరవం తగ్గేలా ఉన్నాయని, బిగ్ బాస్ షోపై ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వారం హోస్ట్ గా వచ్చే నాగార్జున కూడా ” అతి’ చేసేవారికి అనుగుణంగా తనకు నచ్చిన తీర్పులు ఇచ్చేస్తుంటాడని, వైల్డ్ కార్డు ఎంట్రీలకు స్పెషల్ పవర్స్ ఇస్తూ ఇంటిని వారి అజమాయిషీ లోకి తేవడం, ఓటింగ్ తో సంబంధం లేకుండానే కొందరిని హోస్ నుండి బయటకు పంపడం అంతా వారి ఇష్టం.. అసలు ఈ షో వల్ల ప్రజలకు ఎలాంటి మంచి జరగదని ,బిగ్ బాస్ హౌజ్‌ను ముట్టడిస్తామని కూడా కొన్ని ప్రజా సంస్థలు హెచ్చరికలు చేస్తున్నారు.
