సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో నేటి మంగళవారం నుండి శుక్రవారం వారం వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చ రిక జారీ చేసింది. రేపు బుధవారం బంగాళాఖాతం వాయవ్య ప్రాంతం పై గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని అంచనా. దీనిప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే గురు, శుక్రవారాల్లోనూ మరింత భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఝార్ఖండ్ దక్షిణ ప్రాంతం పై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావం తో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నం దున భారీవర్షాలు కురిసే సూచనలున్నా యి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *