సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం బంగారం ధరలు కాస్త దిగివస్తున్నాయి. . దీపావళి పండుగకు బంగారం ధర పరుగులు తీసింది. అయితే పండుగ కాగానే పలువురు మార్కెట్ నిపుణులు చెప్పినట్లు ఇక ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టింది. వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. అక్టోబర్ 26న దేశీయంగా తులం బంగారం ధరపై రూ.160 నుంచి రూ.180 వరకూ తగ్గింది. ఇక వెండి ధర కిలోపై రూ.300 వరకూ పెరిగింది. అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో వెండి, బంగారు ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నేడు, భద్రవరం తెలుగు రాష్ట్రలలో ప్రధాన నగరాల్లో బంగారం ధర గమనిస్తే విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,110కు లభిస్తుంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,110 ధర లో లభిస్తుంది.
