సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు, బుధవారం ఉదయం 9-30 నుండి 10 గంటల సమయంలో హైదరాబాద్ , సింగరేణి, వరంగల్, గోదావరి నది పరివాహక ప్రదేశాలు, విజయవాడ, విశాఖ పట్నం లో పలు ప్రాంతాలలో భూమి 3 సెకన్స్ పాటు కంపించింది. అయితే తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారం అడవుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.అక్కడ రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు సమాచారం. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా భూప్రకంపనలు నమోదు అయ్యాయి. అయితే భూకంపంపై శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం వచ్చిన భూకంపం ములుగు జిల్లాలో సంభవించింది. జన సంచారం లేని ప్రాంతంలో ఇది రావడం వల్ల పెనుప్రమాదం తప్పింది. భూమికి 40 కిలోమీటర్ల లోపల భూకంపం రావడంతో దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో కనిపించింది. భూమిలో పగుళ్ల కారణంగా ఇలాంటివి ఏర్పడతాయి. గోదావరి బెల్ట్ ఏరియాలో భూమి లోపల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మరల కూడా ప్రకంపనలు వచ్చే అవకాశలు ఉంటాయి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *