సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ రైల్వేలో పార్సిల్ యాప్‌తో సరికొత్త సేవా రంగంలోకి దక్షిణ మధ్య రైల్వే ( Railway parcil App )అడుగుపెడుతుంది. ‘రైల్ పార్సిల్ యాప్’ పేరుతో లాజిస్టిక్ సర్వీస్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే – హైదరాబాద్ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో రైల్ పార్సిల్ యాప్‌ని డెవలప్ చేసింది. సికింద్రాబాద్ రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ రైల్ పార్సిల్ యాప్‌ని లాంచ్ చేశారు.. ప్రెవేటు కొరియర్ల తరహాలో.. ఇంటి వద్దనే పార్సిల్ బుకింగ్, డెలివరీ సర్వీసులను అందించే లక్ష్యంతో ‘రైల్ పార్సిల్ యాప్’ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. భారతీయ రైల్వేలో తొలిసారిగా ఈ పైలట్ ప్రాజెక్టును హైదరాబాద్ డివిజన్‌లో అమలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. మొదటగా 7 నగరాల్లో ‘రైల్ పార్సిల్ యాప్’ సేవలను ప్రారంభించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నైలలో ఈ సర్వీసులని అందుబాటులోకి తెచ్చింది. దక్షిణ మధ్య రైల్వే.. ఇతర మూడు లాజిస్టిక్ పార్టన్స్‌తో కలిసి డోర్ టు, మిడిల్, మెయిన్ డెలివరీ సర్వీసులకి శ్రీకారం చుట్టింది.
