సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా వచ్చే మరి కొద్దీ రోజులలలో ఖాళీ కానున్న పదవి కాలం పూర్తయిన రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నేడు, సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీనిలో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ఏపీలో 3 స్థానాలు ఏకపక్షంగా గెలవడానికి కావలసిన ఎమ్మెల్యల బలం వైసిపి కి ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కి బయట నుండి మరో 5గురు ఎమ్మెల్యేల మద్దతు ఉంటె 2 స్థానాలు, బిఆర్ ఎస్ పార్టీ కి ఒక స్తానం గెలిపించే ఎమ్మెల్యేల బలం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *