సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం రాత్రి కూడా పాకిస్తాన్ ఇండియాలోని జమ్మూ కాశ్మిర్, పంజాబ్, రాజస్థాన్ లోని పలు ప్రాంతాలలో డ్రోన్ లతో దాడి కి ప్రయత్నిస్తుండటం తో భారత్ మరోసారి మరి ఈ రాత్రి పాకిస్తాన్ దూల మొత్త్తం తీర్చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో హైఅలర్ట్ (High Alert) ప్రకటించారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, కూకట్‌పల్లి, నాంపల్లి, హైదరాబాద్ సెంట్రల్ బస్‌స్టేషన్, ట్యాంక్‌బండ్‌తో పాటు ఏపీలోని తిరుమల, విశాఖ ఆర్కే బీచ్, విజయవాడ రైల్వేస్టేషన్, విజయవాడ బస్‌స్టాండ్, ఎంజీ రోడ్‌లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. హైదరాబాద్ అంతా కూడా అలర్ట్ జోన్‌లో ఉంది.
