సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా బంగాళాఖాతంలో అల్పపీనడం ఏర్పడే అవకాశం ఉందని, రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడురోజులు బలమైన గాలులు వీస్తాయని వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ శనివారం పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయని అన్నారు. గత శుక్రవారం వర్షాలు కురియడంతో ఏపీలో వాతావరణం చల్లబడింది. అయితే కోస్తా ఆంధ్ర లో ఇంకా ఉక్కబోతలు తగ్గలేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *