సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఏపీ రాజ్యసభ ఏపీ లో ఎమ్మెల్యేల కోటాలో నాతో పాటు నామినేషన్ వేసిన ముగ్గురి గెలుపు కూడా తథ్యమని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నేడు, మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడం చాలా అవసరమని అన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరి కొంత కాలం పొడిగించాలని తమ సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసిపి పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నదని .. ఎందుకంటే ఏపీ విభజన తరువాత 10 ఏళ్ళ పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను పెట్టారని గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా తాత్కాలిక రాజధానిగా అమరావతిని నిర్మించడం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రాజధానికి కావలసిన అన్ని ఆధునిక హంగులు, వనరులు ఉన్న విశాఖ రాజధాని అని అనుకున్నామని చెప్పారు. దానిపై కూడా న్యాయ పరమైన ఇబ్బందులు పెట్టారని వాటిని కూడా ఎదుర్కొంటున్నామని తెలిపారు. వాటిని అన్నిటినీ అధిగమించిన అంతవరకు కూడా హైదరాబాద్‌ను కొనసాగించాలని తమ ఆలోచన అని వివరించారు.. సుబ్బారెడ్డి ప్రకటన తరువాత ఏపీలో పలువురు వైసీపీ నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇప్పటికే ముందు చూపుతో ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులను తెలంగాణ నుండి ఎంపిక చేసిన సీఎం జగన్ తన రాజకీయ ప్యూహనికి కేంద్రం మద్దతు పలికే అవకాశం ఉంది.
