సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం నేటి బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..ఈ సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరిగిందన్నారు. ఇరు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో చర్చలు జరిగాయని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ‘బానకచర్ల” వివాదంపైనిపుణులతో కమిటీ సోమవారం లోపు ఏర్పాటు చేస్తామని మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారని ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్రాల నిపుణులు ఉంటారని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలపై ఈ సందర్భంగా చర్చించామన్నారు. కృష్ణా నది బోర్డు అమరావతిలో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే గోదావరి బోర్డు తెలంగాణలో ఏర్పాటు చేసేలా నిర్ణయించామని తెలిపారు. తెలంగాణ వారు శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులు చేసేందుకు ఏపీ అంగీకారించిదన్నారు. అలాగే టెలిమెట్రీ ఏర్పాటుకు సైతం అంగీకరించామని మంత్రి నిమ్మల అన్నారు.
