సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురి అయిన ప్రజలు బాధలు వర్ణనాతీతం.. ఈ క్రమంలో సినీ, రాజకీయ.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తూ ‘మేము సైతం’ అంటూ ముందుకొస్తున్నారు. ఇప్పటికే వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ 25 లక్షల రూపాయిల ఏపీకి విరాళంగా ప్రకటించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయిలు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని నా వంతుగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షల రూపాయిలు విరాళంగా ఇస్తున్నాను’ అని ట్విట్టర్లో ఎన్టీఆర్ ప్రకటించారు. మరోవైపు.. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విశ్వక్ సేన్ రూ. 5 లక్షల విరాళంగా ప్రకటించారు.
