సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్లు అర్జున్ అరెస్ట్ తదుపరి నేపథ్యంలో హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి కి భారీ సినిమాల ప్రముఖులకు రగడ మొదలు అయ్యింది. ఇకపై తెలంగాణాలో చారిత్మక సినిమాలు కు తప్ప ఏ సినిమాలకు టికెట్ రేట్లు పెంపు, బెనిఫిట్ షో లు ఉండవని ప్రకటించిన నేపథ్యంలో..ఆంధ్ర ప్రదేశ్ లో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. అల్లూరి జిల్లాలో పర్యటించిన ఆయన.. తెలుగు సినీ పరిశ్రమ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నానన్నారు. సినిమా షూటింగ్‌లకు అందరూ విదేశాలకు పోతున్నారని.. అలా వెళ్లకుండా ఇక్కడే అందమైన ప్రదేశాలు ప్రకృతి సోయగాలు మధ్య షూటింగ్‌లు చేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అన్ని విధాలా ఆలోచించే ఏపీలో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు పవన్‌కళ్యాణ్.. ఇదిలా ఉండగా సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు. అయితే హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పవన్, సీఎం చంద్రబాబు పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ కు షిఫ్ట్ అయితే సినీ పరిశ్రమ తో పాటు కూటమి పార్టీల కార్యాకర్తలకు బాగుంటుందని జనసేన టీడీపీ నేతలు భావిస్తున్నారు.
