సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హనుమాన్’తో పాన్ ఇండియా స్టార్ గా ఊహించని విజయాన్ని అందుకున్నాడు తెలుగు యువ హీరో తేజ సజ్జా. అదే వేగంతో హాలీవుడ్ స్థాయిలో మరో ప్రయోగాత్మక చిత్రం ‘మిరాయ్’ ని ఈ సెప్టెంబర్ నెల లో రిలీజ్ కు సిద్ధం చేసాడు. సామ్రాట్ అశోక చక్రవర్తి కాలం నాటి కథను లింక్ చేస్తూ ఫాంటసీ సినిమాగా ఇందులో తేజా సజ్జా సూపర్ యోధగా కనిపిస్తాడు. అతనికి ప్రతి నాయకుడుగా మంచు మనోజ్ లుక్ బాగుంది. ఇక కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ప్యాక్టరీ సంస్థపై టీజీ విశ్వ ప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్నారు. దాదాపు 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లలో సెప్టెంబర్ 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనేడు గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను వదిలారు. చాల చక్కగా కట్ చేసారు. తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరన్, జగపతిబాబు ఇలా మెయిన్ ఆర్టిస్ట్‌లు అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తూ ట్రైలర్ కట్ చేశారు. 3 నిమిషాల ఆరు సెకెన్ల ట్రైలర్ ప్రేక్షకులలో భారీ ఆసక్తిని పెంచడం ఖాయం.
