సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చైనా సమీపంలోని తైవాన్ దేశంలో నేడు, ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా నమోదైంది. భూమికి పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూ ప్రకంపనలతో జనం ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు యుజింగ్ జిల్లాలో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వంతెనలు కూలిపోయాయి. భారీగా ఆస్తినష్టం జరిగింది. ఇంకా ప్రాణ నష్టంపై వివరాలు అందాల్సి ఉంది. ( పైన తాజా దృశ్యం)
