సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: ఈ ఏడాది జూన్ నాటికల్లా తొలిదశ డిజిటల్ లైబ్రరీల పనులు పూర్తయ్యేలా చూడాలని సీఎం వైఎస్ జగన్‌అధికారులను ఆదేశించారు. ఇంధనశాఖ, డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్ట్‌పై నేడు బుధవారం జరిగిన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. డిజిటల్ లైబ్రరీల నిర్మాణంతో వర్క్‌ఫ్రం హోం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్‌టాప్, యూపీఎస్, ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు డెస్క్‌టాప్ టేబుల్స్, సిస్టం ఛెయిర్స్, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్లు, ఐరన్ రాక్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.ఫేజ్ 1లో మిగిలిపోయిన డిజిటల్ లైబ్రరీల నిర్మాణాలను ఫేజ్ 2లో కవర్ అయ్యేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసినట్లవుతుందని తెలిపారు. ఇంకా మొదలుకాని చోట్ల పనులు వెంటనే ప్రారంభించాలని తెలిపారు.ఈ సమీక్షా సమావేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది,తదితరులు పాల్గొన్నారు.
