సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పెద్ద నాన్న స్వర్గీయ కృష్ణంరాజు సంస్మరణ సభ మొగల్తూరు చరిత్రలో నిలిచిపోయేలా చేసిన లక్షమందికి కనివిని ఎరుగని రాజుల విందు ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నారు “భీమవరం బ్రాండ్”భారతీయ సినీ బాహుబలి’ ప్రభాస్. నేడు, శుక్రవారం కూడా మొగల్తూరు లోని తన నివాసంలోనే ఉన్నారు. ఇక తాజా అప్ డేట్ ఏమిటంటే.. ప్యాన్ ఇండియా స్టార్‌గా ప్రస్తుతం ‘ఆది పురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్- కె’ వంటి వందల కోట్ల భారీ క్రేజీ మూవీస్ చేస్తున్నారు. . అందులో భారతీయుల ఆరాధ్య దైవము ,రియల్ హీరో శ్రీరామచంద్రుని పాత్రతో చేస్తున్న ‘ఆది పురుష్’పై అభిమానుల అంచనాలు మామూలుగా లేవు. అద్భుత గ్రాఫిక్స్ తో సహా ‘ఆదిపురుష్’ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. తాజాగా తొలిసారి ఆ మూవీలో రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. అందులో.. మొనదేలిన మీసాలు కలిగిన క్షత్రియుడు శ్రీరాముని చేతిలో బాణం ఉంది. అంతేకాకుండా.. ఆయన ఆ బాణాన్ని వదిలేందుకు సిద్ధంగా ఉండగా.. మెరుపులు వస్తున్నాయి.దీనికి సంబంధించిన ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అందులో.. ఆ పోస్ట్‌కి.. ‘యూపీలోని అయోధ్యలో ప్రవహిస్తున్న సరయునది ఒడ్డున మా అద్భుత యాత్రను ప్రారంభించనున్నాం. మా చిత్రం మొదటి పోస్టర్, టీజర్‌ను అక్టోబర్ 2న రాత్రి 7:11 గంటలకు మాతో కలిసి ఆవిష్కరించండి!. ఆదిపురుష్ జనవరి 12, 2023న IMAX & 3Dలో థియేటర్‌లలో విడుదల అవుతుంది!’ అని రాసుకొచ్చాడు.
