సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. అంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా పని చేస్తూ 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ” ఇది మంచి ప్రభుత్వం ” కార్యక్రమాన్ని భీమవరంలో 39వ వార్డు దుర్గపురంలో నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమం అందించడంలో చంద్రబాబు విజయవంతమయ్యారని, వరద విపత్తు సమయంలో కూటమి నేతలు బాధితులకు అండగా నిలబడ్డారన్నారు. తొలి వంద రోజుల్లోనే రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో సురక్షితంగా ఉండేలా విశిష్ట పాలన చేశారని, పేదల ఆకలి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ ప్రకటించిందని, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేసిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజాగ్రహానికి గురై అధికారాన్ని కోల్పోతే సంక్షేభంలో ఉండి కూడా, సంక్షేమానికి అధిక ప్రాథాన్యం ఇవ్వడం చంద్రబాబు, పవన్ ల సాధ్యమని అన్నారు. అనంతరం ఇది మంచి ప్రభుత్వం పోస్టర్‌ ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారది, మెఱగాని నారాయణమ్మ ,కోళ్ల నాగేశ్వరరావు, చెన్నమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, ఎఎంసి మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, 39వ వార్డు ఇన్ ఛార్జ్ లు హరి, శ్రీనాథ్, కోళ్ల నాగబాబు, త్రివిక్రమ్, భగత్ సింగ్, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *