సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరిజిల్లా టిడిపి అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్ , మాజీ రాజ్యసభా సభ్యురాలు తోట సీతారామలక్ష్మి జన్మదినాన్ని పురస్కరించుకొని, నేడు, సోమవారం ఆమె స్వగృహం వద్ద జిల్లా కు చెందిన టీడీపీ నేతలు జన్మదిన శుభ కాంక్షలు తెలియజెయ్యడం జరిగింది. ఈ సందర్భముగా స్థానిక నేతల ఆధ్వర్యంలో పాతబస్టాండ్ వద్ద గల పాత అన్నా క్యాంటీన్ వద్ద ఆమె తరపున మెంటే పార్ధసారధి, వేండ్ర శ్రీనివాస్, కోళ్ల నాగేశ్వరరావు, ఏసుపాదం, ఐజాక్ బాబు, సతీష్ తదితర నేతల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్కడ ” మీరు రక్తపాతం చేసిన మేము అన్నదానం చేస్తాం” అంటూ స్లోగన్ తో చంద్రబాబు బొమ్మవేసి స్లోగన్ తో .. ఒక ఫ్లెక్సీ కట్టడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *