సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తోలేరు – ఉత్తరపాలెం గ్రామంలో జలజీవన మిషన్ నిధులతో 20 వేల లీటర్ల సామర్థ్యం గల ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు నేడు, శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. అమరజీవి జలధార పథకంలో స్వచ్ఛ గోదావరి జలాలు సరఫరాకు అన్ని గ్రామాల్లోని ఇంటింటికి మంచినీటిని అందించడమే లక్ష్యమన్నారు. త్వరలోనే పనులను పూర్తి చేసి గ్రామాలకు స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తామని అన్నారు. సుమారు రూ 1400 కోట్లతో అమరజీవి జలధార పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. జలజీవన్ మిషన్ ద్వారా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, జలజీవన్ మిషన్ ద్వారా విజ్జేశ్వరం నుంచి ప్రతి గ్రామానికి గోదావరి జలాలను తీసుకుని రావడం జరిగిందని, కలుషితమైన నీరు లేకుండా స్వచ్ఛమైన మంచినీటిని అందించడం జరుగుతుందని అన్నారు. కలుషితం నీరుతో ఎంతో మంది అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్నారని, ఇక, ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, గ్రామస్తులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *