సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమ్మవార్ల జాతరలు గ్రామ శాంతిని కోరుకుంటాయని, సంప్రదాయ బద్దంగా అమ్మవార్ల జాతరలను నిర్వహించడం శుభ పరిణామమని PAC చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు.బీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో శ్రీపోలేరమ్మ దండు గంగనమ్మ జాతర మహోత్సవాన్ని నేడు ఆదివారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని ఎమ్మెల్యే అంజిబాబు దర్శించుకున్నారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, కూటమి నాయకులు మహిళలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *