సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహేష్ బాబు తో సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నుంచి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. ఐకాన్ స్టార్అ ల్లు అర్జున్ తో సినిమా తియ్యాలని త్రివిక్రమ్ ఇంతకాలం నిరీక్షించారు. అయితే పాన్ ఇండియా స్టార్ గా పుష్ప 2 స్థాయి సినిమా కోసం బన్నీ ప్రస్తుతం అట్లీ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. త్రివిక్రమ్ ను ప్రస్తుతానికి ప్రక్కన పెట్టాడు. నిజానికి గురూజీ 3 ఏళ్ళ క్రితం విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తానని చెప్పి వెనక్కి తగ్గాడు. మరి ఇప్పుడు చుస్తే సంక్రాంతి కి వస్తున్నాము సినిమాతో తెలుగునాట వెంకీ 300 కోట్ల హీరో అయిపోయాడు. అందుకే ఎక్కడ పోగొట్టుకొన్నామో అక్కడే వెతుకోవాలని మరల వెంకటేష్ ను ఒప్పించి కొత్త సినిమా కు సిద్ధం అవుతున్నారు. వచ్చే జులై లో షూటింగ్ ప్రారంభించి శరవేగంగా షూటింగ్ పూర్తీ చేసే పనిలో గురూజీ షెడ్యూలు సిద్ధం చేస్తున్నారు. త్రివిక్రమ్ రాసిన ‘భీమవరం వెటకారం’ మాటలను మాట్లాడాలంటే వెంకటేష్ తరువాతే ఎవరైనా..వారిద్దరి కెమిస్ట్రీ మాములుగా ఉండదు.. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత వాసు’ ఓ మోస్తరు హిట్ తరువాత ఇంతకాలానికి తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ సినిమా అంటే మార్కెట్ లో క్రేజ్ మాములుగా లేదు..త్రివిక్రమ్ కూడా తన మాటల కలానికి పదును పెట్టుకోవాలి..నో డౌట్ వెంకిమామ చితకొట్టేస్తాడు
