సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో అతడు’, ‘ఖలేజ’ చిత్రాల తర్వాత మూడోసారి కాంబినేషన్‌ రిపీట్‌ కానుంది. ‘అతడు’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక్క అనవసర సన్నివేశం లేని జిగి బిగి కధనం ఉన్న సినిమా సూపర్ హిట్ కాగా … ‘ఖలేజా’ మాత్రం పర్వాలేదనిపించింది. దానిలో ఓం నమః శివాయ ! సాంగ్ మాత్రం ఒక అద్భుతం గా నిలచింది. ముచ్చటగా 3వ సారి పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం అందుకునే దిశగా త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. మహేశ్‌ నటిస్తున్న 28వ చిత్రం షూటింగ్ ఇటీవల సారధి స్టూడియోలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. అక్కడ కార్‌ బ్లాస్టింగ్‌ వంటి పోరాట సన్నివేశాలను తెరకెక్కించారు త్రివిక్రమ్‌. ఇటీవల ఫారిన్‌ ట్రిప్‌కి వెళ్లొచ్చిన మహేశ్‌ సెట్‌లో అడుగుపెట్టనున్నారు. రేపు సోమవారం నుంచి హైదరాబాద్‌ శివార్లో పది కోట్ల బడ్జెట్‌తో వేసిన భారీ హౌస్‌లో సెట్‌లో మహేశ్‌ బాబు, పూజా, ప్రకాశ్‌రాజ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. యంగ్‌ హీరోయిన్స్ శ్రీలీల , భూమి పెడ్నేకర్‌ లు కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.ఒక ప్రముఖ స్టార్ హీరో కూడా కీలక పాత్రలో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. సీనియర్‌ నటి రమ్యకృష్ణ కూడా ఈ చిత్రంలో ఓ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తీ చేసి త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఇంటర్నేషనల్ స్థాయిలో పాన్ వరల్డ్ సినిమా షూటింగ్ కు సిద్దమౌతున్నాడు మహేష్ బాబు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *