సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జమిలి ఎన్నికల కు చట్టం రూపొందించే దిశగా పార్లమెంట్ లో బీజేపీ వేసిన ముందడుగు ను అడ్డుకొనేందుకు ఇండియా కూటమిలోని కాంగ్రెస్ ఎంపీ లతో సహా ఇతర పార్టీలు లోక్ సభలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వేళా.. తాజాగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు నేడు. గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. మరోవైపు అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీయే అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం ఎంపీలు కూడా ఎదురుదాడిగా నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పార్లమెంట్ లోకి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వివాదం, స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. దీంతో బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కిందపడటంతో అతని తలకు గాయమైంది. హుటాహుటీన ఆయన్ను ఆస్పత్రికి తలరించారు. ఈ సందర్భంగా గాయపడిన ఎంపీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేయడంతో.. అతను వచ్చి నామీద పడటం వల్ల నేను కిందపడినట్లు పేర్కొన్నాడు. స్వల్ప తోపులాటలో మరో బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్‌పుత్‌లకు గాయాలయినట్లు తెలిసింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఫై కేసు పెట్టాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
