సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసిపి లో సీఎం జగన్ తరువాత అత్యంత కీలకనేత ఎంపీ విజయసాయి రెడ్డి తాజగా ఏపీలో తెలుగుదేశం పార్టీ లో నెలకొన్న సంక్షోభం ఫై సంచలన ట్విట్ చేసారు. అయన ట్విటర్ లో.. తెలుగుదేశం అధినాయకుడు కరప్షన్ కేసులో జైలు పాలైనా పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టీడీపీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. త్వరలోనే ఆ పార్టీ రెండు మూడు ముక్కలుగా చీలిపోవచ్చు. 40 ఏళ్లుగా పార్టీకి మద్ధతిస్తున్న ‘బలమైన’ వ్యాపార వర్గంలో కూడా పునరాలోచన మొదలైంది. ఆయన దోపిడీలను తామెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారు. అని ట్విట్ చేసారు. 24 రోజుల క్రితం చంద్రబాబు అరెస్ట్ కాగానే ..ఆయనపై ఉన్నఅనేక అవినీతి కేసులు కు గట్టి ఆధారాలు ఉన్నాయని ఇప్పట్లో జైలు నుండి ఆయన బయటకు రారు, ఇంకో 10 ఏళ్ళ వరకు బాబుకు జైలు జీవితం తప్పదు అని తొలిసారి ప్రకటించి సంచలన రేపిన విజయసాయి తాజా ట్విట్ తో మరింత అనుమానాలు రేకెత్తిస్తున్నారు.
