సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల థియేటర్లలో విడుదలైన 3వారాలకే ఓ ప్రయోగాత్మక చిత్రంగా పేరు తెచ్చుకున్న శ్వాగ్’ సడన్‌గా ఓటిటి లోకి వచ్చేసింది. శ్రీ విష్ణు, మీరా జాస్మిన్ , రీతూ వర్మ , దక్షా నగార్కర్, సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. ‘రాజ రాజ చోర’ వంటి మంచి విజయం తర్వాత హసిత్ గోలి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. ఈ ఆక్టోబర్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెప్సాన్స్ దక్కించుకున్నప్పటికీ ప్రథమార్ధం స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం పైగా 1500వ శతాబ్ది నుండి ప్రస్తుతం వరకు జరుగుతున్నా కధ కావడం అందులో 4 పాత్రలు హీరో శ్రీ విష్ణు పోషించడంతో అందరికీ రీచ్ కాలేకపోయింది. శ్రీ విష్ణు మాత్రం నట విశ్వరూపం చూపించాడు. శ్వాగ్ (Swag) అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideo) లో నేటి శుక్రవారం (ఆక్టోబర్ 25)నుండి స్ట్రీమింగ్ అవుతుంది. వైరిటి సినిమాలు కోరుకునేవారు తప్పక చూడవలసిన సినిమా శ్వాగ్
