సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అఖండ, వీరసింహ రెడ్డ్ ఘన విజయాలతో మంచి స్వింగ్ లో దూసుకొనిపోతున్న నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రం దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే దీని తర్వాత బాలకృష్ణ హీరోగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో కలసి ఓ సినిమా కు సిద్ధం అవుతున్నారు. దీని హీరో శివరాజ్ కుమార్ ఇప్పటికే ధృవీకరించారు. అయితే ఈ మల్టి స్టార్ సినిమాకు సంబంధించి మరో సన్సేషనల్ ట్విస్ట్ బయటకు వచ్చింది. రాజకుమార్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో .. కన్నడ అగ్ర దర్శకుడు హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించడానికి సిద్ధం అయ్యినట్లు, ఇప్పటీకే దర్శకుడు హర్ష రజనికి కథ వినిపించి ఒకే అనిపించుకొన్నారని ఫిల్మ్ వర్గాల వార్త! అతి త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.చారిత్రక నేపథ్యం కథతో ఇది రెండు భాగాలుగా సినిమా తెరకెక్క నున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సీనియర్ హీరోల దక్షిణాది మల్టి స్టార్ సినిమా వచ్చే విజయదశమికి షూటింగ్ ప్రారంభము అవుతుందని భావిస్తున్నారు.
