సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దీపావళి, ఛత్ పండ‌గుల సమయంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇండియ‌న్ రైల్వే మ‌రో ఏడువేల ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. వీటితోపాటు రైల్వేస్టేష‌న్లలో ప్రయాణికుల రక్షణ కోసం ప‌లు కొత్త విధానాల‌ను కూడా అమ‌ల్లోకి తీసుకొచ్చింది. రైళ్లలోని జనరల్ బోగీల్లో ఎక్కే ప్రయాణికుల సౌకర్యార్థం ఇక నుండి రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాంలపై క్యూలైన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. అయితే.. పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మొత్తం 26 స్పెష‌ల్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక రైళ్లతో పాటుగా పలు ప్రధాన రైల్వే స్టేషన్లలోరైళ్లు టికెట్స్ కౌంటర్లు వద్ద రద్దీ నివారించడానికి 14 అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం తదితర స్టేషన్లలో అదనపు కౌంటర్లు తో పాటు అదనపు సిబ్బందిని కూడా నియమించినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *