సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్ప పీడన ప్రభావం తో తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లపై వరద నీరు చేరటంతో దక్షిణ మధ్య రైల్వే 36 రైళ్లను రద్దు చేసింది. ( trains cancel) అంతేకాకుండా, మరో 25 రైళ్ల దారిని మళ్లించింది, 14 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. అయితే, ఈ నిర్ణయం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని ప్రయాణికులను, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ వైపు ప్రయాణించే వారిని ప్రభావితం చేస్తుంది. రద్దు చేయబడిన రైళ్ల జాబితా కోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) లేదా IRCTC వెబ్‌సైట్ వంటి అధికారిక రైల్వే వెబ్‌సైట్‌లను తనిఖీ చేయాలని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *