సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జగన్ మీడియా సమావేశం తరువాత నేటి శుక్రవారం అసెంబ్లీ సమావేశాలలో ‘దమ్ముంటే అసెంబ్లీకి రా.. ప్రతి విషయంపై అసెంబ్లీలో చర్చ పెడదాం’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ కి చంద్రబాబు సవాల్ విసిరారు. రాజకీయ కక్షసాధింపు తనకు ఇష్టం ఉండదని అయితే హత్యలు చేసి తప్పించుకుంటామంటే ఊరుకోమని చట్ట ప్రకారం శిక్షించి తీరుతామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 2019-24 మధ్య రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలు జరిగాయని అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని సభ ముందు సీఎం చంద్రబాబు ఉంచారు. రాష్ట్రంలో ప్రజల తలసరి ఆదాయం పెరగలేదు కానీ వైసీపీ నేతల ఆదాయం వందల వేల లక్షల రెట్లు పెరిగిపోయిందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే.. మరల పాలన మారితే తాను అధికారంలోకి వచ్చి మళ్లీ పీకపై కత్తిపెడతానని పారిశ్రామిక వేత్తలను మాజీ సీఎం జగన్ బెదిరిస్తున్నాడని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ‘‘నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం.. రాజకీయ ముసుగులో దాగనివ్వం. జగన్ మాట్లాడితే రూ.2 లక్షల 71 వేల కోట్లు బటన్ నొక్కానని అంటారు. మీరు రూ.9 లక్షల 74 వేల కోట్లు అప్పు ఏపీ కోసం తెచ్చానని చెప్పి ఏం చేశారో చెప్పాలి. విశాఖ రాజధాని అని చెప్పి అక్కడి ఆస్తులను కూడా తాకట్టు పెట్టారు. మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో 22 ఏ ఫైళ్లు తగలబెడితే అది అగ్ని ప్రమాదం అంటారా..? దాన్ని విచారణ చేయిస్తే తప్పా. ?మాజీ మంత్రి వివేకాది గుండెపోటు అంటే నమ్మాలా..? ముచ్చుమర్రిలో తప్పుచేసిన వారిని వదిలి పెట్టమని చూపించాం. దేశంలోనే ఎక్కువ అప్పు ఉన్న రైతులు రాష్ట్రంలో ఉన్నారు. త్వరగా ఆర్థిక వ్యవస్థను రివైవ్ చేస్తాం. ఎమ్మెల్యేలు ఒక రోడ్డు వేసుకోవాలంటే డబ్బు ఇవ్వలేని పరిస్థితి ఏపీలో వైసీపీ పాలనలో వచ్చింది’’ అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
