సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్న గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకం గురించి తెలియని వారు అరుదు. ఈ నాటకం అప్పారావు 1892 లో రాసారు. ఇది సమాజం లో వున్న రుగ్మతలపై సెటైరికల్ గా తెలుగులో రాసిన మొట్టమొదటి సంచలన నాటకం. ఈ నాటకం రాసి వందేళ్లకు పైగా అవుతున్న కూడా, ఈనాటికి ప్రజాదరణ పొందుతూనే వుంది. కొన్ని వందల, వేల సార్లు ఈ నాటకాన్ని ప్రపంచం నలుమూలల ప్రదర్శించిన సంఘటనలు ఎన్నో వున్నాయి. ఈ నాటకాన్ని 1955 లో పి పుల్లయ్య దర్శకత్వంలో అప్పట్లో సినిమాగా కూడా తీశారు. అందులో ఎన్ టి రామరావు , సావిత్రి , షావుకారు జానకి , గోవిందురాజుల సుబ్బారావు లాంటి నటులుతో కన్యాశుల్కం సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ నాటకం ఆసాంతం టీవీలలో వెబ్ సిరీస్ గా క్రియేటివ్ దర్శకుడు క్రిష్ పర్యవేక్షణలో ఒక భారీ ఇంటి సెట్లో శరవేగంగా రూపొందిస్తున్నాడని ఫిల్మ్ వర్గాల సమాచారం. అయితే ఇందులో హీరో గిరీశం పాత్రల ఎవరు వేస్తున్నారు అన్నది సస్పెన్సు..కీలకమైన మధురవాణి పాత్రలో యాంకర్ అనసూయ నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. కోట శ్రీనివాస రావు , రవి ప్రకాష్, మురళి శర్మ లాంటి నటులు ఇందులో కొన్ని ముఖ్య పాత్రల్లో వేస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *