సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాటి అగ్ర దర్శకుడు ఇటీవల భారతీయుడు 2, గేమ్ చేంజెర్ వంటి భారీ ప్లాప్ లతో నిర్మాతల వందల కోట్ల సొమ్ములు అనవసరంగా ఉడకబెట్టేస్తున్నాడు అన్న అపవాదులు మూటగట్టుకున్న సినీ దర్శకుడు శంకర్‌కు తాజగా మద్రాస్ హైకోర్టు నుండి పెద్ద ఊరట లభించింది. ఇటీవల ఉన్న కష్టాలకు తోడు శంకర్ స్థిర, చరాస్తులను జప్తు జేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తీసుకున్న నిర్ణయంపై కోర్టు మధ్యంతర స్టే విధించింది. సూపర్ హిట్ చిత్రం ‘ఎంథిరన్’ ( తెలుగులో రోబో సినిమా)లోని ఆర్థిక అవకతవకలు జరిగియంటూ డైరెక్టర్ శంకర్‌పై కేసు నమోదైంది. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని హిందీలో ‘రోబోట్’ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివాదం కారణంగా, శంకర్‌కు చెందిన రూ.11.10 కోట్ల విలువైన ఆస్తులను ED జప్తు చేసింది. అయితే, తాజాగా హైకోర్టు నిర్ణయం నుండి శంకర్‌కు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఈ కేసును విచారించిన హైకోర్టు, ఈ విషయానికి సంబంధించిన ప్రైవేట్ ఫిర్యాదుపై ఇప్పటికే స్టే విధించింది. శంకర్ ఆస్తిని స్తంభింపజేయడం సమర్థనీయం కాదని కోర్టు తన తీర్పు లో అభిప్రాయపడింది. అయితే ఇది శంకర్ కు తాత్కాలిక ఉపశమనం మాత్రమే..
