సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గ్రీకు భాషకు చెందిన ఉత్తేజితమైన ప్రచండ ‘శక్తి ‘ కి ప్రతిరూపం .. ‘సిగ్మా’ పేరు మన భీమవరం ప్రజల అందరికి గత 33 ఏళ్లుగా ‘సిగ్మా కేబుల్ టివి’ గా సుపరిచయం. ఇప్పుడు సిగ్మా తెలుగు డాట్ ఇన్ ఆన్ లైన్ న్యూస్ గా ప్రపంచ వ్యాప్తంగా సుపరిచయం. అయితే ప్రపంచ వ్యాప్తంగా గత 3 దశాబ్దాలుగా ఎంతో పాపులర్ సంస్థలు ఈ పేరు పెట్టుకున్నాయి. అయితే తాజాగా త‌మిళ సూపర్ స్టార్, ద‌ళ‌ప‌తి విజయ్ (Thalapathi Vijay) కుమారుడు జాసన్‌ సంజయ్ (Jason Sanjay) తొలిసారి మెగాఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కుడిగా మారి త‌న తొలి ప్ర‌య‌త్నంగా తెలుగు, త‌మిళ న‌టుడు సందీప్ కిష‌న్ తో క‌లిసి భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ (Lyca) లో నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘సిగ్మా’ (sigma) అని పేరు పెట్టారు. 2026 వేస‌విలో ప్రేక్ష‌కుల ఎదుట‌కు సినిమా తీసుకు రానున్నారు. హైద‌రాబాదీ ఫ‌రియా అబ్దుల్లా క‌థానాయిక‌గా, త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *