సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాడిపత్రిలో ఇటీవల వరుసగా టీడీపీ కౌన్సిలర్లు ఫై జరుగుతున్నా వైసీపీ గూండాల దాడులను ఖండిస్తున్నానని అన్నారు. తాజగా కౌన్సిలర్ విజయ్ కుమార్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వైసీపీ నేతలు దాడి చేసారని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడితే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. విజయ్ కుమార్‌పై వైసీపీ కి చెందిన నలుగురు యువకులు కర్రలతో దాడి చేసారని కానీ పోలీసులు చర్యలు తీసుకోలేదని , గత రెండు రోజుల క్రితం ఇదే తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్ మల్లిఖార్జునపై దాడి జరిగిందన్నారు. దళితులపై సీఎం జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై వైఎస్సార్ దాడుల కానుక పథకం అమలవుతుందని విమర్శించారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఆగడాలకు అంతులేకుండా పోతోందన్నారు.సీఎం జగన్ ని మించిన నియంతలా పెద్దారెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీడీపీ కౌన్సిలర్లపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *