సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా పండుగ రోజులు కావడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కార్డు ఉన్నవారి అందరికి అందరికీ పంచదార, కందిపప్పు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలోని స్థానిక రేషన్ డీలర్స్ అక్టోబరులో రేషన్ ఇచ్చేందుకు ఈ సెప్టెంబర్ నెల ఆఖరి వారంలోగా డీడీలు సమర్పించాలి. బియ్యానికి కొద్దిపాటి సొమ్ములు చెల్లిస్తే సరిపోతుంది( కేజీ ఒక్క రూపాయికే ఇస్తారు కాబ్బటి ). కానీ పంచదార, కందిపప్పులకు పెద్దమొత్తంలో చెల్లించాలి. పైగా ఇటీవల కందిపప్పు తీసుకోవడానికి కార్డుదారులనుంచి స్పందన అంతంత మాత్రమే ఉంటోంది.చాల చోట్ల నాణ్యత లేకపోవడంతో కందిపప్పు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు అని, తమ వద్ద నిల్వ ఉండటంతో పురుగుపడుతుందని డీలర్స్ వాపోతున్నారు. దీనివల్ల డిపాజిట్లు చెయ్యాలంటే నష్ట భయం వెంటాడుతోందని డీలర్స్ వాపోతున్నారు. .ప్రతి రేషన్‌కార్డుకు కిలో వంతున వచ్చే పప్పు కేటాయిస్తున్నారు. లబ్ధిదారులు కిలో రూ.67 చెల్లించాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో రూ.95 నుండి 100 వరకు ఉన్నప్పటికీ రేషన్‌ పప్పుపై ఆసక్తి చూపడంలేదు. పంచదారను లబ్ధిదారులకు అరకిలో వంతున రూ.17కు ఇస్తున్నా రు. దీనికి డిమాండ్ ఉంది. బహిరంగ మార్కెట్‌లో అరకిలో రూ.20 పైన ఉంది. వాస్తవం ఏమైనా మంచి నాణ్యత తో కూడిన కందిపప్పు డీలర్స్ కు ప్రభుత్వం అందజేస్తే ఇటు డీలర్స్, అటు ప్రజలకు మేలు కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *