సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వాయుగుండం ప్రభావం తో పశ్చిమ గోదావరి జిల్లాలో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. గత వారం రోజులుగా ప్రతి రోజు ఎంత ఎండా కాసిన ఒక్కసారిగా వాతావరణం మారటం వర్షపు జల్లులు కురవడం భీమవరం లో సహజంగా జరుగుతుంది. నేటి బుధవారం సాయంత్రం చలిగాలులతో మేఘాలు కమ్ముకున్నాయి. ఇక తూర్పుమధ్య బంగాళాఖాతంలో బలమైన తుపానుగా మారిన ‘దానా’ ముంచుకొస్తోంది. ఒరిస్సా లోని పూరి గుండా తీరం దాటనున్న నేపథ్యంలో ఉత్తరాంద్ర ,గోదావరి జిల్లాలోనూ తీరా ప్రాంతాలలో దీని ప్రభావం ఆందోళన కలిగిస్తోంది., ఈ తుపాను గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా, ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటనుందని పేర్కొంది. కాగా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం నుంచి గంటకు 80-100 కి.మీ. వేగంతో వీస్తాయని తెలిపింది. ఇక రేపు (గురువారం) రాత్రి నుంచి 100-110 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
