సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఊహించని రీతిలో ఉల్లి ధర బహిరంగ మార్కెట్ లో కేజీ 20-25 రూపాయలకు పడిపోగా టమాటా ధర మరి దారుణంగా పడిపోయింది. రైతు వద్ద కిలో రూ.5 కన్నా తక్కువ పలుకుతూ రైతులకు నష్టాన్ని మిగుల్చుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కోత కూలి రావడం లేదని ఆవేదన చెందుతున్నారు .ఇదే టమాట 8నెలలు కిందట కిలో రూ.200కు పైగా ధర పలికి రైతులకు లాభాలు తెచ్చిపెట్టడంతో పాటు కొనుగోలు దారులు బిత్తర పోయేలా చేసింది. అయితే రానురాను ఈ టమాటా సాగు పెరగడంతో ధర తగ్గుతూ వచ్చింది. అయితే బహిరంగ మార్కెట్ లో రవాణా చార్జీలు, లాభాలు కలుపుకొని కేజీ 20 రూపాయలకు టమాట వినియోగదారులకు అందుబాటులో ఉంది. నూనె రేట్లు కూడా దిగిరావడంతో టమాటా పచ్చళ్ళు పట్టుకోవాలనుకొనేవారికి ఇదే అనువైన సమయం మరి..
