సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీవల కర్నూల్ వద్ద కర్ణాటక వెళ్లే ప్రవేటు బస్సు ప్రమాద ఘటన మరువక ముందే తాజగా నేడు, సోమవారం ఉదయం తెలంగాణలోని చేవెళ్ల లో ట్రిప్పర్ వచ్చి 70 మంది ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు ను వేగంగా ఢీ కొట్టడంతో బస్సు ప్రయాణికులు అక్కడ ఉన్న రాళ్ల కంకరలో కూరుకుపోయారు. జరిగిన ప్రమాదం లో ఇప్పటివరకు 20 మంది మరణించడం,పలువురు గాయపడటం దేశవ్యాప్తంగా ప్రజలను దిగ్బ్రాంతి పరుస్తుంది. దీనిపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. చేవెళ్ల బస్సు-టిప్పర్‌ ప్రమాదంపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. కండక్టర్‌ రాధా, మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చేవెళ్ల పీఎస్‌లో FIR నమోదైంది.ఈ దుర్ఘటనలో బస్ డ్రైవర్ , ట్రిప్పర్ డ్రైవర్‌ లలో తప్పు ఎవరిదో తేలవలసి ఉంది.106(1) BNS సెక్షన్‌ కింద FIR నమోదైంది. ఇదిలాఉంటే.. మృతుల .కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం తరపున 5లక్షలు, ఆర్టీసీ 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కేంద్రం నుంచి 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *