సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల 92 ఏళ్ళ వయస్సులో వృదప్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని ప్రవేటు హాస్పటల్ లో కొంత కాలంగా చికిత్స పొందుతున్న సినీ కళాతపస్వీ కె.విశ్వనాథ్ గత గురువారం రాత్రి స్వర్గస్తులయ్యారు. ఆయన మరణ వార్త తెలియడంతో నేటి శుక్రవారం ఉదయం నుండి దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కెసిఆర్ ఆ మహనీయుని మృతి కి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన నివాస గృహం వద్ద ఆయన భౌతిక దేహాన్ని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులంతా కదిలి వచ్చి కన్నీటి తో ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మరణం సినీ పరిశ్రమకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొప్ప దర్శకుడిగానే కాకుండా ఇండస్ట్రీ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ మృతి నేపథ్యంలో సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకి నివాళిగా నేడు జరగనున్న అన్ని సినిమా షూటింగులను స్వచ్ఛందంగా నిలిపివేసిట్లు తెలిపింది. ఇక అయన దర్శకత్వం వహించిన 50 కి పైగా తెలుగు హిందీ చిత్రాలలో శంకరాభరణం తెలుగు సంగీత సాహితి కీర్తిని అంతర్జాతీయ స్థాయికి చేర్చింది. నటుడిగా కూడాసుమారు 20 చిత్రాలలో నటించిన కే విశ్వనాధ్ ఇప్పటి తరం హృదయాలపై తెలుగు పెద్దాయన ముద్ర బలంగా వేశారు.
