సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఈ రోజు శనివారం ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం కానుంది. ఇరాన్ తాజగా ప్యూహాత్మకంగా యుద్ధం తగ్గుదల పట్టేలా ఒక ప్రకటన చేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల మధ్య అమెరికా మిత్ర దేశాలుగాభావిస్తూ ఇరాన్ 8 గల్ఫ్ దేశాలపై జరిగిన భీకర దాడులకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నేడు, శనివారం క్షమాపణలు చెప్పారు. ఇరాన్ మీడియాతో మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలపై దాడులు చేయాలన్న ఉద్దేశం తమకు లేదని, పొరుగు దేశాలు నుండి అమెరికా యుద్ధ విమానాలు తమపై దాడి చేయకుంటే ఇరాన్ కూడా దాడి చేయదని స్పష్టం చేశారు.తాత్కాలిక నాయకత్వ కౌన్సిల్ నిన్న ఈ నిర్ణయం తీసుకుందని, ఇక నుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయవద్దని ఆదేశాలు ఇచ్చారని ఆయన ప్రకటించారు. ఇకపై సరిహద్దులోని గల్ఫ్ దేశాలతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలనే ప్రయత్నంగా భావిస్తున్నారు. ఈ ప్రకటనతో సౌదీ, దుబాయి, కువైట్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో కొంత ఊరట నెలకొంది.
