సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం నేపథ్యంలో దేశంలో బంగారం ధరలు మరింత దిగి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో నిన్న కేవలం రూ.100 తగ్గిన బంగారం ధర నేడు మాత్రం మరికాస్త ఎక్కువే తగ్గింది. నేడు గురువారం ఆర్నమెంట్ బంగారం ధర ఎక్కువగా తగ్గడం విశేషం. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.300 తగ్గి రూ.54,050కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ. 220 మేర తగ్గి రూ.58,960కి చేరుకుంది. ఈ ఏడాది ఆరంభంలో 10గ్రాముల 24కారెట్స్ బంగారం బంగారం ధర దాదాపు 62 వేలకు చేరుకుంది. నేడు 58 వేలకు దిగి రావడం విశేషం. ఇక వెండి ధర విషయానికి వస్తే నిన్న రూ.600 మేర పెరగ్గా.. నేడు రూ.400 పెరిగి రూ.71,900కు చేరుకోవడం గమనార్హం..నేడు, విజయవాడ ,హైదరాబాద్ మార్కెట్ లలో ఇదే ధరకు అందుబాటులో ఉంది
