సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూరగాయలు ధరలు మరల ఇటీవల కాస్త దిగి వస్తున్నాయి. ఇక వంట గదిలో కీలకమైన ఉల్లిపాయల ధరలు బాగా దిగొస్తున్నాయి.గత 40 రోజుల క్రితం వరకు లో కేజీ 50- 60 రూపాయల వరకు అమ్మిన ఉల్లి ధర గత నెల రోజుల నుండి బాగా దిగి వస్తుంది. గత వారంలో కేజీ 25 రూపాయలకు అందుబాటులో ఉంది అయితే గత రెండు, మూడు రోజుల నుంచి ఉల్లిపాయల ధరల్లో అనూహ్యమైన తగ్గుదల కనిపిస్తోంది. మహారాష్ట్రలో కొత్త పంట చేతికి రావడంతో డిమాండ్ కంటే ఎక్కువగా భారీ సంఖ్యలో ఉల్లిపాయల లోడు లారీలు గోదావరి జిల్లాల మార్కెట్‌కు వస్తుండడంతో ఇక్కడి హోల్‌సేల్ వ్యాపారులు వచ్చిన పాయలను వచ్చినట్టే బహిరంగ మార్కెట్లకు ఆటో లలో పంపిస్తున్నారు. దానితో వారు మినీ వ్యాన్లలో ఆటోలపై ఇంటింటికీ తిరిగి ఉల్లి ధర 100 రూపాయలకే 7 కేజీలు అంటూ ఉదర కొడుతున్నారు. అయితే రైతు బజార్లలో మాత్రం కిలో రూ.20 రిటైల్ వ్యాపారుల వద్ద 25లకు తగ్గడంలేదు. కానీ తాము నాణ్యత కల్గిన నిల్వ ఉండే పాయలు తెస్తున్నామని, ఆటోలలో అమ్మే కొత్తపాయలు నిల్వకు ఆగవు అని చెబుతున్నారు. అయితే హోటళ్లు, కర్రీపాయింట్ల వారికి మంచి ఉపయోగం ఉంటుంది. ఏది ఏమైనా నాణ్యత ఉన్న ఉల్లి ధర కూడా కేజీ 20 రూపాయలకు రావడం కూడా బాగా అందుబాటులోకి వచ్చినట్లే కదా?.
