సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఈ వారం చివరలో బంగారం, వెండి ధరల్లో భారీగా మార్పు కనిపించింది. ఇటీవల కాలంగా భారీగా పెరగడమే తప్ప తగ్గడమనేది తక్కువనే చెప్పాలి. కానీ ఈ గురువారం స్థిరంగా ఉన్న బంగారం ధర.. శుక్రవారం నాటికి రూ.230.. ఇక నేడు (శనివారం) రూ.430 వరకూ తగ్గింది.అంటే 2రోజులలో రూ.660 మేర తగ్గింది. ఒకానొక సమయంలో 10గ్రాముల బంగారం ధర దాదాపు రూ.62 వేలు కూడా దాటేసింది.తాజగా నేడు.. రూ.59 వేలకు దిగి వచ్చింది. దీంతో నేడు, శనివారం హైదెరాబాద్, విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్స్ 10గ్రాములు బంగారం రూ.54,100 వేలకు చేరుకుంది. కాగా.. 24 క్యారెట్స్ బంగారం ధర (10 గ్రాములు) రూ.59,020కి చేరుకుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. నిన్న కిలో వెండిపై రూ.1000 తగ్గగా.. నేడు రూ.500 తగ్గింది. నేడు కిలో వెండి ధర రూ.71,500కి చేరుకుంది.
