సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వస్తున్నా బంగారం ధరలు తాజగా నేడు, శనివారం. మరోసారి తగ్గాయి. ఢిల్లీ, కలకత్తాలలో తాజా రేటు ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 84,450గా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.79,590గా ఉంది. తెలుగు రాష్ట్రాల మార్కెట్ లో కాస్త ధరలు ఎక్కువగా 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో రూ. 87,440, విజయవాడ , విశాఖపట్నంలలో తక్కువగా రూ.86,420 కు బంగారం అందుబాటులో ఉంది. స్టాక్ మార్కెట్ దారుణంగా నష్టపోవడం ముఖ్యంగా జువెలర్స్ నుంచి డిమాండ్ తగ్గడం, మదుపర్ల లాభాల స్వీకరణ వంటి కారణాలతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక కిలో వెండి ధర కూడా బాగా దిగి వచ్చి ప్రస్తుతం 94,230గా ఉంది
