సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో బంగారం (Gold) ధరలు భారీగా పెరుగుతున్నాయి. అలా గత కొన్ని రోజులుగా 10 గ్రాములు లక్ష మార్కును దాటిన పసిడి ధరలు సామాన్యులకు అందని ద్రాక్షగా మారాయి. అయితే వారం రోజులుగా పెరుగుతున్న ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు వరుసగా రెండో రోజు అంటే ఇవాళ‌ బుధవారం కూడా ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.90,950 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలు ఇవాళ‌ రూ.250 తగ్గి రూ.90,700గా ఉంది. అలాగే నిన్న రూ.99,220 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.270 తగ్గి నేడు రూ.98,950 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.1000 తగ్గి కిలో రూ.1,18,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు (Silver Rates)స్థిరంగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *