సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత వారం బులిటిన్ మార్కెట్ లో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరిన బంగారం (gold), వెండి (silver) ధరలు ప్రస్తుతం దిగి వస్తున్నాయి. గత వారం లక్ష రూపాయలను దాటేసిన బంగారం తాజగా 98 వేలకు దిగి వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు, మంగళవారం (జులై 8న) ఉదయం సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 98, 280కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 90, 100కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే 24 క్యారెట్ల బంగారం ధరం రూ.600 మేర, 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 మేర తగ్గింది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98, 280కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 90, 100కి చేరింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ వెండి హైదరాబాద్‌లో, విజయవాడలో రూ. 1, 19, 900 ఉండగా ఢిల్లీ లో మాత్రం రూ. 1, 09, 900 కు నేడు, మంగళవారం ఉదయం అందుబాటులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *