సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ శ్రీలంక తీరం దిశగా నెలకొన్న వాయుగుండం ‘దిత్వా’ తుపానుగా మారి చెన్నె నగరానికి చేరువగా వస్తున్నా కారణంగా తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై, కడలూరు(Kadaluru), విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలకు, పుదుచ్చేరిలో రెడ్ అలర్ట్ జారీ చేసారు. పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.. నేడు, శనివారం భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ ‘దిత్వా’ తుపాను రేపు ఆదివారం వేకువజాము దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఏపీలో నేటి సాయంత్రం నుండి మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే ధనుష్కోడి, అరిచ్చల్‌మునై సముద్రతీర ప్రాంతాల్లో గంటకు 65 నుండి 70 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో పర్యాటకుల సంచారంపై అధికారులు నిషేధం విధించారు. కాగా నేడు, శనివారం పుదుచ్చేరిలో అన్ని విమాన సేవలను రద్దు చేశారు. శ్రీలంక లో తుపాను దెబ్బకు జనం ఇప్పటికే విలవిలా లాడుతున్నారు.
