సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామంలో స్వయంభూ శ్రీగంగా భ్రమరాంభ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన రథం నిర్మాణ కార్యక్రమాన్ని నేడు, ఆదివారం ఉదయం ఎమ్మెల్యే అంజిబాబు పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. ముందుగా రథానికి 10 లక్షలు అందించిన ప్రధాన దాతలు గాదిరాజు జానకి రామరాజు, ఝాన్సీ లక్ష్మి దంపతులు, గాదిరాజు నారాయణరాజు, శ్రీదేవి దంపతులచే పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూపరమేశ్వరుని అనుగ్రహంతోనే అన్ని దైవ కార్యక్రమాలు జరుగుతాయని, స్వయంభూ దేవాలయానికి 72 ఏళ్ల చరిత్ర ఉందని, సుమారు రూ 30 లక్షలతో నూతన రథం ఏర్పాటు చేసుకోవడం సంతోషించదగ్గ విషయమని, దాతలు భక్తులు ముందుకు రావడం ఆనందదాయకమని అన్నారు. దేవస్థానం చైర్మన్ అల్లూరి బంగార్రాజు మాట్లాడుతూ రెండు మూడు నెలల్లో నూతన రథ నిర్మాణం పూర్తి చేస్తామని, శివరాత్రికి ఈ దేవాలయంలో రథోత్సవం ఏర్పాటు చేస్తామని, ఈ నూతన రథ నిర్మాణానికి దాతలు భక్తులు విరాళాలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఉమ్మడి జిల్లా అడ్జక్షుడు చినబాబు రధం కోసం 50 వేల రూ .ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజు రూ 50 వేలు కానుకగా అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *