సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ వైద్య అధికారుల సదరం శిబిరాల ద్వారా విచారణ తదుపరి వేలాదిగా దివ్యంగుల పెంక్షన్ లు, దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్నట్లు తప్పుడు సెర్టిఫికెట్లు సమర్పించిన వారి పెంక్షన్స్ లు రద్దు కావడంతో పలువురు తమకు అర్హత ఉన్న పెంక్షన్ తొలగించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వివిధ కారణాలతో దివ్యాంగుల పెన్షన్ రద్దయిన వారు మెడికల్ బోర్డు నిర్వహించే వైద్య పరీక్షలో, సదరం సర్టిఫికెట్లు పరిశీలనలో కనీసం 40 శాతం అంగవైకల్యం ఉందని సర్టిఫికెట్ పొందితే పెన్షన్ పునరుద్ధరిస్తారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రధాన ఏరియా ఆసుపత్రిలలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. మెడికల్ బోర్డు ఇచ్చే సర్టిఫికెట్‌ను అయా మండల ఎంపీడీవోకు సమర్పించాల్సి ఉంటుంది. మెడికల్ బోర్డు పరీక్షకు హాజరయ్యేటప్పుడు ఆధార్ కార్డు, పాత పెన్షన్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు ఫొటో, మెడికల్ బోర్డు అప్లికేషన్ ఫారంతో పైన పేర్కొన్న ఆసుపత్రిలో జరిగే వైద్య పరీక్షలకు హాజరు కావాలి.అని తెలిపారు.
