సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లాలోనే ప్రతిష్టాకర సంస్థ గా పేరొందిన.. ది భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్వసభ్యసమావేశం నేడు, శనివారం ఉపాధ్యక్షులు శ్రీతుమ్మలపల్లి శివ, అధ్యక్షతన జరిగింది. ఈసమావేశములో 2025-2026 సంవత్సరం అధ్యక్షులు పులఖండం కోటేశ్వరరావు అద్వర్యములో జరిగిన జమాఖర్చులును కార్యదర్సులు సర్వ సభ్యులకు చదివి వినిపించారు. సర్వసభ్యులుఆమోదించారు. తదుపరి గత 2025-2027 వ సంవత్సరము ఎలక్షన్ లో సర్వసభ్యుల అందరి సమక్షములో అనుకున్న విధముగా 2026-2027 సంవత్సరమునకు మానేపల్లి సూర్య నారాయణ గుప్త ను తిరిగి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా సర్వ సభ్యులు సమావేశంలో ఆమోదించి తీర్మానించడంతో సభ్యులు ఆయనను సన్మానించారు. ఈకార్యక్రమములో ఉపాధ్యక్షులు వభిలిశెట్టి వెంకటేశ్వరరావు, నార్కిడమిల్లి గురుప్రసాద్ కార్యదర్సులు కాగిత వెంకటరమణ, సంగడి బుజ్జి , ఆర్.వి.ప్రసాద్, సుంకర చిన బాబు, కోశాదికారి,కురిశేటి కుమార్ బాబు మరియు ఛాంబర్ సర్వసభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *