సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం లో ప్రతిష్టాకరమైన ది భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ వారు పట్టణ వ్యాపార ప్రముఖుల సమక్షంలో భీమవరంలో నేడు, ఆదివారం నిర్వహించిన “అభినందన గౌరవ ఆత్మీయ సత్కార మహోత్సవం”లో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులను సత్కరించారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ లతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులకు ‘ది భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భముగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కు ఎమ్మెల్యేకు ఇచ్చిన భీమవరం ప్రాంత సమస్యల పరిష్కారం కోసం విజ్ణాపన పత్రం అందజేశారు. దానిలో కీలకంగా భీమవరం పట్టణ శివారులు నందమూరు గురువు ,తాడేరు రోడ్డు, యనమదురు రోడ్డు, అనాకోడేరు, రాయలం,చినమీరం పెద్దమిరం కలుపుతూ రింగ్ రోడ్డు ను ఏర్పాటు చెయ్యాలని కోరారు. ఇంకా పట్టణంలో పలు రోడ్డులు ఆధునీకరించాలని కోరటం దానికి వారు సానుకూలంగా స్వాందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *